Homeవిచిత్రంViral: Inspiration of the movie 'Shublagnam'.. Viral : ‘శుభలగ్నం’ సినిమా స్ఫూర్తి..

Viral: Inspiration of the movie ‘Shublagnam’.. Viral : ‘శుభలగ్నం’ సినిమా స్ఫూర్తి..

భర్తను రూ.5 లక్షలకు అమ్మిన భార్య

ఇదేనిజం, నేషనల్​ బ్యూరో : ‘శుభలగ్నం’ సినిమాలో హీరోయిన్ ఆమని తన భర్త జగపతి బాబుని ప్రేమించిన మహిళకు రూ.కోటికి విక్రయిస్తుంది. అచ్చం అలాంటి ఘటనే కర్ణాటకలోని మండ్య సమీపంలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. ఓ మహిళతో తన భర్త సన్నిహితంగా ఉన్నాడని ఆ గృహిణి గుర్తించి వారిద్దరూ కలిసున్న సమయంలో రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకుని సదరు మహిళను నిలదీసింది. వారిద్దరి మధ్య గొడవ పెద్దదై పంచాయితీ పెద్దల వరకు వెళ్లింది. దీంతో సదరు మహిళ ‘నీ భర్త నా దగ్గర రూ.5 లక్షలు తీసుకున్నాడు. ఆ మొత్తం చెల్లించి.. నీ భర్తను నువ్వు తీసుకెళ్లు’ అని తేల్చిచెప్పింది. దీంతో సదరు ఇల్లాలు ‘భర్త నాకేమీ వద్దని, నాకే రూ.5 లక్షల నష్టపరిహారం ఇచ్చి, నువ్వే అతన్ని ఉంచుకో’ అని చెప్పింది. ఆ నగదు ఇచ్చేందుకు ఒక నెల సమయం కావాలని ఆ నగదు ఇచ్చేస్తానని ఆ మహిళ చెప్పింది. అందుకు ఆ గృహిణి కూడా అంగీకరించింది. అయితే వీరిద్దరూ చేసుకున్న రాజీ ఒప్పందం చూసి పంచాయితీ ప్రతినిధులు, గ్రామస్థులంతా ముక్కునవేలేసుకున్నారు.

Recent

- Advertisment -spot_img