బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న వంత పరిశి అనే యువతికి ఓ చేదు అనుభవం ఎదురైంది. ఆ విషయాన్ని ఆమె తన X ఖాతాలో షేర్ చేసింది. తాను ఇందిరా నగర్‌లో నడుచుకుంటూ వెళ్తుండగా ఓ ఆటో డ్రైవర్ గుట్కా నమిలి తన పై ఉమ్మివేసినట్లు ఆమె తెలిపారు. ఆమె X లో సంబంధిత ఫోటోలను షేర్ చేసింది. ఈ పోస్ట్ వైరల్ కావడంతో బెంగళూరు పోలీసులు దయచేసి ఆ స్థలం వివరాలు ఇవ్వాలని, వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.