Homeహైదరాబాద్latest NewsViral: ఓటమి తర్వాత కేఎల్ రాహుల్‌ పై లక్నో ఓనర్ సీరియస్..!

Viral: ఓటమి తర్వాత కేఎల్ రాహుల్‌ పై లక్నో ఓనర్ సీరియస్..!

లక్నో సూపర్‌జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా పేరు సోషల్ మీడియా వేదికగా మారుమోగుతోంది. నిన్న ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అయితే ఈ ఘోర పరాజయంతో లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ కు హాజరైన అతడు.. ఈ ఓటమిని తట్టుకోలేకపోయాడు. ఈ మ్యాచ్ అనంతరం కేఎల్ రాహుల్‌తో సంజీవ్ గోయెంకా సీరియస్‌గా చర్చించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఈ ఓటమికి కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను బాధ్యులను చేస్తూ గోయెంకా క్లాస్ పీకినట్లు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.
ఈ మ్యాచ్ పరిస్థితిని కేఎల్ రాహుల్ చెప్పే ప్రయత్నం చేసినా సంజీవ్ గోయెంకా వినిపించుకోలేదు. రాహుల్ పై కోపంతో ఊగిపోయాడు. అయితే హైదరాబాద్ పై ఓడిన తర్వాత లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ పై ఆ ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకా దురుసుగా ప్రవర్తించడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఓడినప్పుడు ప్లేయర్లలో మనో ధైర్యాన్ని నింపకుండా ఇలా చేస్తారా? అని అభిమానులు మండిపడుతున్నారు. రాహుల్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. RRపై KKR ఓడినప్పుడు ఫ్రాంచైజీ ఓనర్ షారుఖ్ ప్లేయర్లతో ప్రవర్తించిన తీరు ఎప్పటికీ మరచిపోలేమన్నారు. షారుఖ్ లాగా మోటివేట్ చేయాలని అభిమానులు సూచిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img