పల్నాడు జిల్లా ఎమ్మాజీగూడెంలో ఘోర ప్రమాదం జరిగింది. సెల్‌ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టి వీరలక్ష్మి (11) అనే బాలిక వీడియోలు చూస్తుండగా ఫోన్ పేలింది. ఈ పేలుడులో వీరలక్ష్మి కుడి చేతి రెండు వేళ్లు పూర్తిగా తెగిపోయాయి. కడుపు భాగంలోనూ గాయాలయ్యాయి. తల్లిదండ్రులు బాలికను ఆస్పత్రికి తరలించారు. సెల్‌ఫోన్లకు ఛార్జింగ్ పెట్టి మాట్లాడటం, వీడియోలు చూడటం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి తప్పులు చేయవద్దని సూచిస్తున్నారు.