నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లి సభలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో నారా బ్రహ్మణి, హీరో రాంచరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి కొంతసేపు ముచ్చటించారు. అయితే వీరిద్దరూ ముందే ఫ్రెండ్సా? లేదా మాములుగా మాట్లాడారా అన్న విషయం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.