బాగా చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాల్సిన విద్యార్థులు కొందరు.. చెడు అలవాట్లకు బానిసలై జీవితాలను సర్వనాశనం చేసుకుంటుంటారు. తాజాగా అటువంటి ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కొందరు స్కూల్ విద్యార్థులు గోడ పక్కన చేరి చాటుగా సిగరెట్లు తాగుతున్నారు. అక్కడ ఓ వ్యక్తి దానిని వీడియో తీశాడు. ఎక్కడ జరిగిందే తెలియరాలేదు గానీ, విద్యార్థుల ప్రవర్తనపై నెటిజన్లు ఫైరవుతున్నారు.