ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసెంబ్లీలో ప్రమాణం చేసిన తర్వాత ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రొటెం స్పీకర్‌కు ధన్యవాదాలు తెలిపిన తర్వాత పక్కన నిల్చున్న సిబ్బందికి సైతం ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చారు. దీంతో పవన్ రియల్ లైఫ్‌లోనూ హీరో అని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. వకీల్ సాబ్ మూవీలో ఓ మహిళా పోలీసుకు షేక్ హ్యాండ్ ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నారు.