Homeహైదరాబాద్latest NewsViral: విమానం ఢీ.. 36 ఫ్లెమింగోలు మృతి

Viral: విమానం ఢీ.. 36 ఫ్లెమింగోలు మృతి

విమానం ఢీ కొని 36 ఫ్లెమింగోలు దాకా మృతి చెందిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది. ఘట్‌కోపర్‌, పంత్‌నగర్‌లోని లక్ష్మీ నగర్ ప్రాంతంలో ఎమిరేట్స్ విమానం ఢీకొనడంతో కనీసం 36 ఫ్లెమింగోలు మరణించాయి. ఎమిరేట్స్ విమానం ఈకే 508 సోమవారం రాత్రి 9.18 గంటలకు పక్షుల్ని ఢీకొట్టినట్లు సమాచారం వచ్చిందని, ఆ తర్వాత సుక్షితంగా ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో 36 ఫ్లెమింగో కళేబరాలు లభ్యమయ్యాయని, మరిన్ని ఫ్లెమింగోలు చనిపోయాయో లేదో తెలుసుకోవడానికి విచారణ ప్రారంభించామని అడిషనల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎస్‌వై రామారావు తెలిపారు. ఘాట్‌కోపర్‌లో చాల చోట్ల చనిపోయిన పక్షుల విరిగిన రెక్కలు, గోళ్లు, ముక్కులు అన్ని చెల్లాచెదురుగా పడ్డాయి.

Recent

- Advertisment -spot_img