Homeహైదరాబాద్latest NewsVIRAL: రామ్ చరణ్ కూతురు క్లీంకారకు ప్రభాస్ స్పెషల్ గిఫ్ట్.. ఉపాసన పోస్ట్ వైరల్..!

VIRAL: రామ్ చరణ్ కూతురు క్లీంకారకు ప్రభాస్ స్పెషల్ గిఫ్ట్.. ఉపాసన పోస్ట్ వైరల్..!

నాగ్ అశ్విన్-ప్రభాస్ కాంబోలో వస్తోన్న ‘కల్కి’ మూవీపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ అంచనాలను మరింత పెంచేందుకు బుజ్జి, భైరవ క్యారెక్టర్స్‌తో మేకర్స్ ‘కల్కి’ మూవీపై పిల్లల్లోనూ ఆసక్తి పెంచుతున్నారు. ఈ క్రమంలో బుజ్జి వాహన బొమ్మలు, భైరవ స్టిక్కర్స్, టీ షర్ట్స్‌ను విక్రయిస్తున్నారు. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వాటిని సెలబ్రిటీ పిల్లలకూ గిఫ్టులుగా పంపిస్తున్నారు. రామ్ చరణ్ కూతురు క్లీంకారకు కూడా ఈ బహుమతులు అందాయి. ‘థ్యాంక్స్ కల్కి టీమ్. ఆల్ ది బెస్ట్’ అంటూ క్లీంకార.. బుజ్జి బొమ్మతో ఆడుకుంటున్న ఫొటోను ఉపాసన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశారు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Recent

- Advertisment -spot_img