బెంగళూరుకు చెందిన ట్రోవ్ ఎక్స్‌పీరియెన్సెస్ అనే కంపెనీ ఏప్రిల్ 28న ‘ఫారెస్ట్ బాతింగ్’ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ప్రకటన ఇచ్చింది. ఇందులో చెట్లను కౌగిలించుకోవడం, అడవిలో నడవడం వంటివి ఉంటాయని, మానసిక ఒత్తిడిని దూరం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు ఒక్కొక్కరు రూ.1,500 చెల్లించాలని ప్రకటించింది. ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.