పంజాబ్ లోని తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ పోలీసు అధికారి అర్థరాత్రి మార్కెట్ విధుల్లో తిరుగుతున్న ముగ్గురు అబ్బాయిలను ఆపాడు. అతను ఆ ముగ్గురు యువకులను తన ముందు నిలబడమని కోరాడు. దానికి యువకులు నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన ఓ యువకుడు కత్తితో పోలీసును బెదిరించి కొట్టాడు. ఈ ఘటన మొత్తం అక్కడి సమీపంలోని ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ వీడియో వైరల్ అవ్వడంతో అధికారులు నిందితుల కోసం దర్యాప్తు ప్రారంభించారు.