పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం లింగంగుంట్లకు చెందిన మేరి, ఓంకారయ్య దంపతులకు ఎస్తేరు రాణి అనే కుమార్తె ఉంది. కొద్ది రోజుల క్రితం తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆమెకు గుండె కుడి వైపు ఉన్నట్లు గుర్తించారు. ఇతర అవయవాలు కూడా వ్యతిరేక దిశలో ఉన్నట్లు తెలిసింది. పాంక్రియాస్ సమస్య వల్ల కడుపునొప్పి వస్తుందని గుర్తించిన వైద్యులు అరుదైన ఆపరేషన్ నిర్వహించారు.