Homeఫ్లాష్ ఫ్లాష్Viral : బైక్​కు పటాకులు కట్టి స్టంట్లు

Viral : బైక్​కు పటాకులు కట్టి స్టంట్లు

– మండిపడుతున్న నెటిజన్లు


ఇదే నిజం, నేషనల్ బ్యూరో: ప్రమాదకర విన్యాసాలతో రీల్స్‌ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం ఈ మధ్యకాలంలో ట్రెండ్‌గా మారింది. రైలు వస్తుండగా, ఎతైన ప్రదేశాల్లో నిల్చొని.. ఇలా ప్రమాదకరంగా రీల్స్‌ చేస్తూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. దీపావళి నేపథ్యంలో ఓ యువకుడు ఇలాంటి విన్యాసమే చేశాడు. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి తన బైక్​పై ప్రమాదకర స్టంట్లు చేశాడు. బైక్‌ ముందుభాగంలో పటాకులను కట్టి..అవి పేలుతుండగా వాహనాన్ని గాల్లోకి లేపుతూ విన్యాసాలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాలో అప్‌లోడ్‌ చేశాడు. ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు అతడి చర్యపై మండిపడుతున్నారు. ‘బైక్‌పై పటాకులతో ఈ విధంగా విన్యాసాలు చేయడం సరికాదు. ఇవి ఇతరులకు కూడా ప్రమాదకరం’అంటూ తిడుతున్నారు. దీనిపై స్పందించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

Recent

- Advertisment -spot_img