ఈ అమ్మాయికి భయం అంటే ఏంటో తెలీదు అనుకుంటా.. కూర్చుని కూడా అందరిని భయపెట్టేసింది.. ఇంతకీ విషయం ఎంతంటే..ఓ యువతి పర్వతంపై కూర్చోవాలని నిర్ణయించుకుంది. అత్యంత ఎత్తైన పర్వతంపైకి ఎక్కిన సదరు యువతి.. మెల్ల మెల్లగా పర్వతం చివర అంచుకు వచ్చి కూర్చుంది. అక్కడి నుంచి కొంచెం కిందకు జరిగినా నేరుగా వచ్చి కొన్ని వందల అడుగుల కిందకు పడిపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి కొండపై కూర్చొని వీడియో చూస్తున్న వాళ్ళని భయపెట్టేసింది. కానీ ఆమె మాత్రం కొంచం కూడా భయపడకుండా ఈ సాహసం చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.