బాలీవుడ్ నటి అనన్య పాండే విజయ్ దేవరకొండ లీగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఘోర పరాజయం పాలైంది. కానీ ఇందులో అనన్య తన నటనతో, అందాలతో బాగానే ప్రేక్షకులను అలరించడంతో ఈ సినిమా తర్వాత కూడా ఈ బ్యూటీ కి బాగానే అవకాశాలు దక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే అనన్య పాండే గత కొంత కాలంగా ఆదిత్య రాయ్ కపూర్ అనే వ్యక్తి తో ప్రేమలో ఉంది. ఇకపోతే చాలా కాలంగా ప్రేమలో ఉన్న అనన్య పాండే, ఆదిత్య రాయి కపూర్ తాజాగా విడిపోయినట్లు తెలుస్తోంది ఈ విషయాన్ని వీరిద్దరి క్లోజ్ ఫ్రెండ్ ధ్రువీకరించినట్లు సమాచారం.
వారిద్దరూ నేల కిందటే విడిపోయారు అని, ఆ విషయం మాకు కూడా పెద్ద షాక్ అని వారు ప్రస్తుతం జీవితంలో ముందుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు అని పేర్కొన్నట్లు సమాచారం. ఇకపోతే ఈ జంట చివరగా అనంత్, రాధిక ఫ్రీ వెడ్డింగ్ వేడుకకు హాజరు అయ్యారు. ఆ తర్వాతే వీరిద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది. ఇక వీరిద్దరూ చాలా రోజుల నుండి ప్రేమలో ఉండడంతో మరి కొన్ని రోజుల్లోనే వీరు పెళ్లి కూడా చేసుకోబోయే అవకాశాలు ఉన్నట్లు చాలా మంది భావించారు. కానీ సడన్ గా వీరికి బ్రేకప్ అయ్యింది అనే వార్త బాలీవుడ్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.