మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ జిమ్ ట్రైనర్ రెచ్చిపోయాడు. 20 ఏళ్ల యోగేష్ షిండే గత రెండేళ్లుగా ములుండ్ ఈస్ట్‌లోని జిమ్‌కు వెళ్తున్నాడు. బుధవారం జిమ్‌లో ఒక ట్రైనర్ సహాయంతో అతడు వ్యాయామాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో వారితో సరదాగా ముచ్చటించాడు. కాగా జిమ్‌లో ఒక పక్కన నిల్చొన్న మరో ట్రైనర్ ధారవి నాకెల్ ఉన్నట్టుండి ఉడెన్ క్లబ్‌తో అతని వద్దకు వచ్చి తలపై కొట్టాడు. దీంతో యోగేష్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ వీడియో క్లిప్ నెట్టింట వైరల్ అయ్యింది.