Homeహైదరాబాద్latest NewsVIRAL: అంపైర్ ను తిట్టిన విరాట్ కోహ్లీ

VIRAL: అంపైర్ ను తిట్టిన విరాట్ కోహ్లీ

కోల్‌కతా వర్సెస్ బెంగళూరు మ్యాచ్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అవుట్ నిర్ణయం వివాదంగా మారి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అయితే ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని అవుట్‌గా ప్రకటించిన థర్ అంపైర్ నిర్ణయం వివాదాన్ని రేపుతోంది. విరాట్ కోహ్లీ కూడా తీవ్ర అసహనంతో మైదానం వీడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివాదాస్పద నో బాల్ నిర్ణయం ఫలితమిది.

హర్షిత్ రాణా స్లో పుల్ టాస్ ఆడే క్రమంలో విరాట్ కోహ్లీ బ్యాట్‌పై అంచుకు తాకిన బాల్ గాల్లోకి లేవడంతో హర్షిత్ రాణా క్యాచ్ తీసుకున్నాడు. అంపైర్ అవుట్ ప్రకటించేశాడు. కానీ విరాట్ కోహ్లీ అది నో బాల్ క్లెయిమ్ చేయడంతో ధర్డ్ అంపైర్ రిప్లై చూసి అవుట్ అనే నిర్ధారించాడు. బంతి బ్యాటర్ నడుము కంటే ఎత్తులో వెళితే నో బాల్‌గా ప్రకటిస్తారు. అయితే ఆ సమయంలో బ్యాటర్ క్రీజులోపలే ఉండాల్సి ఉంటుంది. కానీ విరాట్ క్రీజ్ వెలుపలకు వచ్చి ఆడాడు. దాంతో విరాట్ నడుము కంటే ఎత్తులో బాల్ వచ్చినా అవుట్ ఇవ్వాల్సి వచ్చిందనేది అంపైర్ వివరణగా ఉంది. ఒకవేళ క్రీజ్‌లో ఉన్నా బంతి విరాట్ కోహ్లీ నడుము కంటే తక్కువ ఎత్తులోనే వెళ్లుతున్నట్టుగా సాంకేతికత సహాయంతో బంతి దిశను బట్టి అంపైర్ అంచనా వేశాడు.

Recent

- Advertisment -spot_img