బరువు ఎక్కువగా ఉండటంతో వినేశ్ ఫొగట్ రాత్రంతా తీవ్రంగా శ్రమించారు. స్కిప్పింగ్ చేశారు. బరువు తగ్గేందుకు రాత్రంతా అన్ని ప్రయత్నాలు చేశారు. ఆహారం, నీరు కూడా తీసుకోకపోవడంతో ఈరోజు ఉదయానికి ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఇంత చేసినా 100గ్రాముల బరువు అధికంగానే ఉన్నారు. ఈక్రమంలో ఒంట్లో ఓపిక నశించి కూలబడిపోయారు. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఈ ఫొటోలు చూసి చలించిపోతున్నారు.