మహారాష్ట్రకు చెందిన రక్షా ఖడ్సే ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని మోడీ కేబినెట్‌లో అత్యంత పిన్న వయస్కురాలైన మహిళా మంత్రిగా రక్షా ఖడ్సే గుర్తింపు పొందారు. ఆమె 2010లో 23 ఏళ్ల వయసులో కోథ్లీ గ్రామ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆమె లోక్‌సభకు ఎన్నిక కావడం ఇది వరుసగా మూడోసారి.