డబుల్ డెక్కర్ బస్సు మనకు తెలుసు.. కానీ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ కూడా పూర్తీ అయింది. ఎక్కడో కాదు బెంగళూరులో ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. 3.3 కి.మీ నిర్మించిన ఈ ఫ్లై ఓవర్.. రాగిగుడ్డ నుంచి సెంట్రల్ సిల్క్ బోర్డ్(CSB) వరకు పసుపు రేఖ (RV రోడ్-బొమ్మసంద్ర) మీదుగా విస్తరించి ఉంది. ఇది దక్షిణ బెంగళూరు, వైట్‌ఫీల్డ్, ఎలక్ట్రానిక్స్ సిటీ ఐటీ హబ్‌లను కలుపుతుంది. ఈ ఫ్లైఓవర్ అక్టోబర్ 2021లో పూర్తి కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల ఆలస్యమైంది.