ముంబాయిః ఇండియన్ క్రికేట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ తన అభిమానులకు శుభవార్త చెప్పారు. తన భార్య నటి అనుష్కశర్మ ప్రస్తుతం ప్రెగ్నెంట్ అని, జనవరి 2021 నాటికి తాము ముగ్గురం కాబోతున్నట్లు తన ట్విటర్ అకౌంట్లో వెల్లడించారు. దాంతో కోహ్లీకి దేశ వ్యాప్తంగా ప్రముఖులు, తోటి క్రికెటర్లు, అభిమానుల నుంచి గ్రీటింగ్స్ వెల్లువెత్తుతున్నాయి. 2017 డిసెంబర్ 11న ఇటలీలో అనుష్క-విరాట్ వివాహం జరిగింది. ప్రస్తుతం విరాట్ ఐపీఎల్-2020 ఆడేందుకు దుబాయిలో ఉన్నాడు.