Virat Kohli : ఛాంపియన్స్ ట్రోపీలో భాగంగా నేడు టీమిండియా, న్యూజిలాండ్ జట్లు మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ (Virat Kohli) అరుదైన రికార్డును సాధించాడు. ఈ ఫైనల్ మ్యాచ్ తో విరాట్ కోహ్లీ 550 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రెండవ భారతీయ ఆటగాడిగా నిలిచాడు. సచిన్ టెండూల్కర్ 664 మ్యాచ్‌లు ఆడి మొదటి స్థానంలో ఉన్నాడు. 2013లో రిటైరైన సచిన్ టెండూల్కర్ 200 టెస్టులు, 463 వన్డేలు, ఒక టీ20 ఆడాడు. విరాట్ కోహ్లి ఇప్పటివరకు 123 టెస్టులు, 302 వన్డేలు, 125 టీ20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు.