Homeఫ్లాష్ ఫ్లాష్మరోసారి ప్రాక్టీస్‌కు దూరంగా విరాట్ కోహ్లీ.. అసలు ఏమైందంటే..?

మరోసారి ప్రాక్టీస్‌కు దూరంగా విరాట్ కోహ్లీ.. అసలు ఏమైందంటే..?

టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్‌లో దుమ్మురేపింది. బంగ్లాదేశ్‌తో జరిగిన వార్మ‌ప్ మ్యాచ్‌లో విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో టీమిండియా ప్లేయర్లు సత్తాచాటారు. ఇక న్యూయార్క్‌లో ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే జట్టులో ఆలస్యంగా చేరిన విరాట్ కోహ్లీ ఇంతవరకు ఒక్క ప్రాక్టీస్ సెషన్‌లో కూడా పాల్గొనలేదు. దాంతో విరాట్ కోహ్లీకి ఏమైంది? అంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
అయితే శనివారం బంగ్లాదేశ్‌తో వార్మప్ మ్యాచ్ జరగడంతో భారత ఆటగాళ్లందరికీ మేనేజ్మెంట్ ఆదివారం విశ్రాంతి ఇచ్చింది. అయితే కోహ్లి ప్రత్యేక ప్రాక్టీస్ సెషన్‌ను పాల్గొనాలని భావించినా, అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవు. ఎందుకంటే న్యూయార్క్‌లోని నాసా స్టేడియంలో దక్షిణాఫ్రికా, శ్రీలంక ఆటగాళ్లు సాధన చేశారు. గ్రూప్-డీలో భాగంగా న్యూయార్క్ వేదికగా సౌతాఫ్రికా-లంక ఇవాళ మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో కోహ్లి మరోసారి ప్రాక్టీస్‌కు దూరమయ్యాడు.

Recent

- Advertisment -spot_img