Virat Kohli: చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ మొన్న దుబాయ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అఖండ విజయం సాధించి ఫైనల్‌లోకి దూసుకెళ్లిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ విజయం ముఖ్య పాత్ర వహించిన విరాట్ కోహ్లీ 98 బంతుల్లో 84 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో విరాట్ రికార్డుల మోత మోగించాడు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ కోహ్లీ మరో రికార్డు సాధించాడు. ఈ క్రమంలో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ (701) రికార్డును అధిగమిస్తూ 746 పరుగులు చేశాడు. అలాగే ఐసీసీ వన్డే టోర్నీల్లో అత్యధిక సార్లు (24) 50కిపైగా పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డులకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు సచిన్ పేరిట ఉండేది. అంతే కాకుండా, వన్డేల్లో చేజింగ్‌లో సచిన్ టెండూల్కర్ తర్వాత 8 వేల పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కోహ్లీ మరో రికార్డు సృష్టించాడు. అలాగే, ప్రపంచకప్, టీ20 వరల్డ్ కప్, టెస్ట్ చాంపియన్‌షిప్, చాంపియన్స్ ట్రోఫీ వంటి ఐసీసీ నాకౌట్ మ్యాచుల్లో 1000 పరుగులు చేసిన తొలి ఆటగాడిగానూ కోహ్లీ రికార్డు సృష్టించాడు.