Virat Kohli: ఐపీఎల్-2025 మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను అలరించేందుకు మార్చి 22న ఘనంగా ఆరంభం కానుంది. అయితే ఈ సీజన్‌లో విరాట్ కోహ్లీ భారీ రికార్డుకు చేరువలో నిలిచారు. ఒక్క సెంచరీ చేస్తే టీ20 క్రికెట్‌లో 10 శతకాలు పూర్తి చేసుకొని, పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన తొలి భారత ఆటగాడిగా నిలువనున్నారు. టీ 20 కెరీర్‌లో కోహ్లీ ఇప్పటి వరకు 399 మ్యాచ్‌లు ఆడి 9 సెంచరీలు చేశారు.