Virat Kohli : ఆర్‌సీబీ స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్‌లో 13,000 పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి భారతీయ బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఏప్రిల్ 7, సోమవారం వాంఖడేలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఈ ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో 13000 పరుగులు చేసిన తొలి భారతీయుడిగా విరాట్ కోహ్లీ చరిత్ర పుటల్లో లిఖించుకున్నాడు. ముంబైతో మ్యాచ్‌కి ముందు కోహ్లీ 13000 పరుగులు మైలురాయిని చేరుకోవడానికి కేవలం 17 పరుగులు మాత్రమే దూరంలో ఉన్నాడు. ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ వేసిన మూడో ఓవర్‌లో చివరి రెండు బంతులను కోహ్లీ బౌండరీలు బాది 13వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఫార్మాట్‌లో 13000 పరుగులు చేసిన ఐదవ ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.
T20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు :
14562 – క్రిస్ గేల్ (381)
13610 – అలెక్స్ హేల్స్ (474)
13557 – షోయబ్ మాలిక్ (487)
13537 – కీరాన్ పొలార్డ్ (594)
13001* – విరాట్ కోహ్లీ (386)