సినీ ఇండస్ట్రీలో సినిమాల విడుదల వివిధ కారణాలతో ఆలస్యమవుతాయి. కానీ ఒక సినిమా మాత్రం దాదాపు 12 ఏళ్లు తరువాత విడుదల కాబోతుంది. తమిళ స్టార్ విశాల్ హీరోగా సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ”మదగజరాజా”. ఈ సినిమాని జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ నిర్మించింది. ఈ సినిమాలో విశాల్ సరసన అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్‌లు నటించారు. ఈ సినిమా 2013లో పూర్తయింది. 2012 సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేస్తామని ప్రకటించిన ఈ సినిమా కొన్ని సమస్యల కారణంగా గత 12 ఏళ్లుగా విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో 12 ఏళ్ల నిరీక్షణ తర్వాత ;మదగజ రాజా; విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాని 2025 సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని స్టార్ కమెడియన్ సంతానం తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.