Homeహైదరాబాద్latest Newsబిగ్‌బాస్ హౌసులో తన బ్రేకప్ స్టోరీ చెప్పిన విష్ణుప్రియ..!

బిగ్‌బాస్ హౌసులో తన బ్రేకప్ స్టోరీ చెప్పిన విష్ణుప్రియ..!

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ప్రస్తుతం చివరి దశకి చేరుకుంది. దీంతో హౌసులో ఆటలు ఉత్కంఠభరితంగా సాగుతుంది. తాజాగా హౌసులో విష్ణుప్రియా తన మాజీ లవర్ గురించి కొన్ని విషయాలు చెప్పింది. అయితే హౌసులో ఆటలు అన్ని పూర్తయ్యాక తన మాజీ లవర్ ని విష్ణుప్రియా గుర్తు చేసుకుంది. దీంతో అతను కలలోకి వచ్చాడని అర్ధరాత్రి పృథ్వీ దగ్గరకి వెళ్లికి చెప్పింది. అయితే పృథ్వీని బ్రేకప్ స్టోరీ గురుంచి చెప్పు అని విష్ణుప్రియని అడిగాడు. విష్ణుప్రియ మాట్లాడుతూ.. నేను ప్రేమించిన అబ్బాయి నాకు తెలియకుండానే రెండు తప్పులు చేశాడని..అవి నా మంచి కోసమే చేసిన నాకు నచ్చలేదు అని విష్ణుప్రియ చెప్పింది. అయితే ఆ విషయాలు నాకు ఒకవేళ తెలిస్తే తట్టుకోలేనని అతను నాకు చెప్పలేదు అని…కానీ అవి తెలిసిక నేను నిజంగానే తట్టుకోలేకపోయాను అని..మొహం మీదే చెప్పే దమ్ము లేని వారితో కలిసి ఉండడం ఇష్టం లేక విడిపోయాను అని చెప్పింది. నేను ప్రేమించిన అబ్బాయికి మా అమ్మ స్థానాన్ని ఇచ్చాను అని విష్ణుప్రియ పృథ్వీతో చెప్పింది.

Recent

- Advertisment -spot_img