Homeఆంధ్రప్రదేశ్Vishnuvardhan reddy : ఏపీని ఆఫ్ఘనిస్థాన్‌గా, వైసీపీ నేతలు తాలిబాన్లు లాగా పాలిస్తున్నారు

Vishnuvardhan reddy : ఏపీని ఆఫ్ఘనిస్థాన్‌గా, వైసీపీ నేతలు తాలిబాన్లు లాగా పాలిస్తున్నారు

Vishnuvardan reddy : ఏపీని ఆఫ్ఘనిస్థాన్‌గా, వైసీపీ నేతలు తాలిబాన్లు లాగా పాలిస్తున్నారు

Vishnuvardan reddy : వైసీపీ ప్ర‌భుత్వంపై బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో ఫైర్ అయ్యారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ ఆఫ్ఘనిస్థాన్ గా మారిందని, వైసీపీ నేతలు తాలిబాన్లు లాగా పాలిస్తున్నారని బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు.

వైసీపీని ఉగ్రవాద పార్టీగా ఆయన పోల్చారు.

వైసీపీలో శిక్షణ పొందిన వారు తాలిబాన్లు గా తయారయ్యారని ఆయన అన్నారు.

వారంతా ఎమ్మెల్యేలు , డిప్యూటీ సీఎంల రూపంలో రాష్ట్రాన్ని పాలిస్తున్నారని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు .

ABP C Voter Survey : యూపీలో చరిత్ర సృష్టించనున్న బీజేపీ..

Lockdown : లాక్​డౌన్​పై కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి కీలక వ్యాఖ్యలు

కర్నూలు జిల్లా ఆత్మకూరు ఘటన రెండు వర్గాల మధ్య జరిగింది కాదని…

వైసీపీ , బీజేపీ మధ్య జరిగిన సంఘటన అని, వైసీపీ నేతలను కేసు నుంచి తప్పించేందుకు మత ఘర్షణలుగా చిత్రీకరిస్తున్నారని ఆయన అన్నారు .

ఆత్మకూరు ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి చేస్తున్న చర్యలు ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.

ఎన్డీఎఫ్ రూపంలో ఉగ్రవాదమూకలు పని చేస్తున్నాయి. సీఎం జగన్, హోం మంత్రి సుచరిత దీనికి సమాధానం చెప్పాలి.

శిక్షణ పొందిన కొంత మందిని అరెస్ట్ చేశామని ఎస్పీ మీడియాకు చెప్పార‌ని, పోలీసులు అరెస్ట్ చేసిన ఉగ్రవాద మూకలతో వైసీపీ ఎన్నికల్లో పొత్తుపెట్టుంది అన్నారు.

సీఎం జగన్, ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి మధ్య జరిగిన చర్చలు బయటపెట్టాలి అని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.

No Mask No Petrol : మాస్కులు లేకుంటే పెట్రోల్ పోయ‌రు

Assam CM : జ‌నాల‌ను క‌ల‌వ‌ని సీఎం కేసీఆర్‌

వైసీపీ కేంద్ర ఆఫీస్ సూచనలతోనే ఆత్మకూరులో దాడులు జరిగాయని, పోలీస్ స్టేషన్ పై దాడి జరిగిందని, అక్కడ వాహనాలు దగ్ధం చేశారని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు .

ఆత్మకూరుకు వెళ్లకుండా టీడీపీ నేతలను అడ్డుకున్న వాళ్ళు డిప్యూటీ సీఎం అంజాద్ ఖాన్ , హఫీజ్ ఖాన్ ను ఎందుకు పంపారు … ? అని ఆయన ప్రశ్నించారు.

నిందితులను అరెస్ట్ చేయవద్దని డిప్యూటీ సీఎం సమక్షంలో శిల్ప చక్రపాణి రెడ్డి ఎలా కోరతారు … ? అంటూ ఆయన ప్రశ్న వేశారు.

ఆత్మకూరులో దాడి జరిగింది ఒక వ్యవస్థపైన ….. పోలీసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోవడంపై సీఎం, హోం మినిస్టర్ మాట్లాడారా …. ? అని ఆయన అన్నారు .

గుంటూరు లో పోలీస్ స్టేషన్ పై దాడి చేస్తే వైసీపీ ప్రభుత్వం కేసులు ఎత్తి వేసింది.

ఆత్మకూరులో కూడా కేసులు ఎత్తివేస్తామని ఎమ్మెల్యేలు చెబుతున్నారు.

ఐపిసిని వైసీపీ గా మార్చేస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు .

బాధితుడైన బుడ్డా శ్రీకాంత్ రెడ్డిపై హత్య కేసు ఎలా పెడతారని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు.

Congress : ప్రజల్లోకి వెళ్తే తలెత్తుకోలేక పోతున్నాం

Insurance : ఈ వ‌య‌సులోనే ఇన్సూరెన్స్ తీసుకోండి.. ఎందుకంటే..

Recent

- Advertisment -spot_img