Homeహైదరాబాద్latest Newsమొక్కలు నాటిన విశ్వహిందూ పరిషత్ నాయకులు

మొక్కలు నాటిన విశ్వహిందూ పరిషత్ నాయకులు

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి పట్టణంలో ఈ రోజు స్థానిక అక్కపల్లె రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో విశ్వహిందూ పరిషత్ ధర్మపురి ఆధ్వర్యంలో వృక్షారోజన్ చెట్లు నాటుట కార్యక్రమం నిర్వహించడంజరిగింది. వృక్షారోజన్ అనగా దేవతా వృక్షాలు రావి మేడి జువ్వి ఉసిరి మామిడి లాంటివి మరియు ఫలవృక్షములు, పూల చెట్లు విశ్వహిందూ పరిషత్ ప్రతి సంవత్సరము వర్షాకాలంలో ఏదేని ఒక దేవాలయంలో వీటిని నాటుతుంది. అందులో భాగంగా ఈ రోజు 30 వృక్షాలను నాటడం జరిగింది.

ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ సామాజిక సమరసత కరినగర్ ప్రముఖ్ అల్లం దుర్గాప్రసాద్. వి హెచ్ పి జగిత్యాల జిల్లా సామాజిక సమరసత ప్రముఖ్ కస్తూరి రాజన్న, వి హెచ్ పి నగర అధ్యక్షులు ముత్యపు రమేష్ , మండల అధ్యక్షులు మామిడాల రవీందర్, నగర కార్యదర్శి వెలగందుల బుచ్చన్న ,కార్యదర్శి ఎడ్ల రాజేష్, ఉపాధ్యక్షులు పురం శెట్టి లచ్చన్న ,గాదె లక్ష్మణ్, మండల ఉపాధ్యక్షులు మ్యాన పూర్ణచందర్, బజరంగ్దళ్ నగర సంయోజక్ బోగ అనిల్, సహసంయోజక్ ఆసం సురేష్, కలికోట రాజేష్ ,సోంశెట్టి శివ సాయి ,కుమ్మరి తిరుపతి ,బండారి సత్యనారాయణ, వెంకటేష్, పల్లెర్ల సురేందర్ ,అక్కపల్లె రాజరాజేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ సీపతి సత్యనారాయణ కమిటీ మెంబర్ అప్పం శ్రావణ్ మొదలగు కార్యకర్తలు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img