Vishwabhara : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ”విశ్వంభర” (Vishwabhara) సినిమా కోసం ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వశిష్ట దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటించింది. సోషియో ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్‌ను ఏప్రిల్ 12న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. మొదటి సింగిల్‌ను ‘రామ రామ’ పాటతో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ భారీ బడ్జెట్ సినిమాని UV క్రియేషన్స్ నిర్మిస్తోంది.