Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో ”విశ్వంభర” అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో త్రిష హీరోయినిగా నటిస్తుంది. సోషియో ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గత ఏడాది ఈ సినిమా టీజర్ విడుదల కాగా, దీనిపై కొన్ని విమర్సలు కూడా వచ్చాయి. ఈ టీజర్ లో గ్రాఫిక్స్ సరిగా లేదు అని ఈ సినిమాపై కొంచం నెగటివ్ టాక్ వచ్చింది. ఈ క్రమంలో 2025 సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమాని వాయిదా వేశారు. అయితే ఈ సినిమా గ్రాఫిక్స్ పై చిత్రబృందం పని చేస్తుంది కానీ అనుకుంతా మంచి అవుట్ ఫుట్ రాలేదు అని సమాచారం. ఈ క్రమంలో మెగాస్టార్ డైరెక్టర్ పై కొంచం కొపంగా ఉన్నారు అని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. అయితే సినిమా కధ బాగానే ఉన్నప్పటికీ కానీ దాన్ని వెండితెరపై తీసే క్రమంలో డైరెక్టర్ తడపడ్డాడు అని అలాగే టీజర్ విషయంలో కూడా నెగటివిటీ రావడంతో చిరు హర్ట్ అయ్యారు అని సన్నిహితులు అంటున్నారు. గతంలో ”ఆచార్య” సినిమాలో మెగాస్టార్ లుక్ పై కూడా చాలా విమర్సలు రావడంతో మరోసారి ఆలా అవ్వకూడదు అని చిరంజీవి సంచలన నిర్ణయం తీస్కున్నారు అని తెలుస్తుంది. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ సరిగా రాకపోవడంతో సినిమాను క్యాన్సిల్ చేయాలనీ నిర్ణయంచారు. అయితే ఈ సినిమా డైరెక్టర్ వశిష్ట పరిస్థితి ఏంటి అని సినీ విశ్లేషకులు చర్చిస్తున్నారు. ఈ సినిమాని UV క్రియేషన్స్ బ్యానర్ దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్‌తో నిర్మించింది. ఈ క్రమంలో ఆ నిర్మాతల పరిస్థితి ఏమి అవుతుంది అని సినీ వర్గాలు అంటున్నారు.