Homeజిల్లా వార్తలుఫీజు కట్టి కళాశాలకు రాని విద్యార్థుల ఇల్లు సందర్శన

ఫీజు కట్టి కళాశాలకు రాని విద్యార్థుల ఇల్లు సందర్శన

ఇదే నిజం, గొల్లపల్లి : ఇంటర్మీడియట్ కమీషనర్ ఆదేశాల మేరకు 90 రోజుల ప్రణాళికలో భాగంగా పరీక్ష ఫీజు చెల్లించి కళాశాలకు రాని విద్యార్థుల ఇండ్లకు వెళ్లి వారి యొక్క తల్లిదండ్రులతో మాట్లాడి వారిని కళాశాలకు పంపమని గొల్లపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు కోరడం జరిగింది. 90 రోజుల ప్రణాళిక కచ్చితంగా పాటిస్తే విద్యార్థులందరూ పాసవుతారని అందుకోసం విద్యార్థులు రెగ్యులర్ గా కళాశాలకు రావాలని విద్యార్థులకు తల్లిదండ్రులకు వివరించడం జరిగింది.ప్రిన్సిపాల్ ఏనుగుల మల్లయ్య సూచన మేరకు కమిషనర్ ఆదేశాల ప్రకారం ఎవరైతే రెగ్యులర్గా కళాశాలకు రాకపోతే వారి పేర్లను తొలగించడం జరుగుతుంది.దీనికోసం కళాశాల అధ్యాపకులైన రమేష్,రాంప్రసాద్,ప్రసాద్,గుంజపడుగు,బతికేపల్లి,రాఘవపట్నం,లింగాపూర్ గ్రామాలకు వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులను,కామర్స అధ్యాపకులు జి శ్రీనివాస్ రాపల్లి,ఇస్రాజ్ పల్లి గ్రామాల్లోని కళాశాలకు రాని విద్యార్థుల తల్లిదండ్రులను కలిశారు.

Recent

- Advertisment -spot_img