HomeరాజకీయాలుBJP కి వివేక్​ గుడ్​ బై

BJP కి వివేక్​ గుడ్​ బై

– కాంగ్రెస్​ పార్టీలో చేరిక
– కిషన్​ రెడ్డికి రాజీనామా లేఖ
– బీజేపీని వీడటం బాధగా ఉందన్న మాజీ ఎంపీ
– మేనిఫెస్టో కమిటీ చైర్మన్​గా ఉన్న వివేక్​
– నోవాటెల్​లో రాహుల్​ గాంధీతో భేటీ
– చెన్నూరు టికెట్​ ఇచ్చే చాన్స్​
– వరసగా బీజేపీని వీడుతున్న నేతలు

ఇదేనిజం, హైదరాబాద్​: వివేక్​ వెంకటస్వామి బీజేపీకి గుడ్​ బై చెప్పారు. ఈ మేరకు ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డికి రాజీనామా లేఖ సమర్పించారు. అనంతరం ఆయన కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ సమక్షంలో కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీని వీడటం బాధగా ఉందని వివేక్​ రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్నారు. వివేక్​ వెంకటస్వామి పార్టీ మారబోతున్నారని చాలా రోజులుగా ప్రచారం సాగుతోంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారని కూడా ఊహాగానాలు వినిపించాయి. అందరూ ఊహించినట్టుగానే ఆయన బీజేపీని వీడారు. ఇక వివేక్​ వెంకటస్వామి కాంగ్రెస్​ పార్టీలో చేరబోతున్నారు. హైదరాబాద్​ నోవాటెల్​ హోటల్​ లో ఉన్న రాహుల్​ గాంధీతో ఆయన భేటీ అయ్యారు. అక్కడే కాంగ్రెస్​ పార్టీ కండువా కప్పుకున్నారు. చెన్నూరు టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సూత్రప్రాయంగా అంగీకరించినట్టు సమాచారం.

వివేక్​ చేరిక వెయ్యి ఏనుగుల బలం : రేవంత్​ రెడ్డి

నోవాటెల్​ హోటల్​ లో వివేక్​ వెంకటస్వామి రాహుల్​ గాంధీ సమక్షంలో కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు. అనంతరం రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వివేక్​ వెంకటస్వామిని తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించామని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్​ పార్టీని గద్దె దించాలంటే కాంగ్రెస్​ పార్టీతోనే సాధ్యమని భావించి వివేక్​ కాంగ్రెస్​ పార్టీలో చేరారని రేవంత్​ అన్నారు. వివేక్​ చేరిక కాంగ్రెస్​ పార్టీకి వెయ్యి ఏనుగుల బలం ఇచ్చిందని చెప్పారు. కాంగ్రెస్​ పార్టీకి ఎంతో అవసరమని రేవంత్​ అన్నారు.

కలిసికట్టుగా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం : వివేక్​

కాంగ్రెస్​ పార్టీ నిర్ణయం ప్రకారం తాను పనిచేస్తానని వివేక్​ వెంకటస్వామి అన్నారు. కేసీఆర్​ సర్కారుకు వ్యతిరేకంగా పనిచేసేందుకే తాను కాంగ్రెస్​ పార్టీలో చేరినట్టు చెప్పారు. తనకు టికెట్​ ముఖ్యం కాదని వివేక్​ అన్నారు. ‘తెలంగాణ సాధన కోసం అందరూ కొట్లాడారు. అందుకే సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇచ్చారు. కానీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీఆర్ఎస్​ ప్రభుత్వం పనిచేయడం లేదు. కేసీఆర్​ను గద్దె దించాలంటూ అందరూ కలిసి పనిచేయాలి. అందుకే నేను కాంగ్రెస్​ పార్టీలో చేరాను.’ అంటూ వివేక్​ పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img