Homeతెలంగాణఅభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే వారికే ఓటేశా

అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే వారికే ఓటేశా

– మంత్రి కేటీఆర్

ఇదే నిజం, హైదరాబాద్: తెలంగాణ పౌరుడిగా తన బాధ్యతను నెరవేర్చానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణలో ఓటు ఉన్న పౌరులంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో తన సతీమణి శైలిమతో కలిసి కేటీఆర్‌ ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేవాళ్లకే ఓటు వేశానని తెలిపారు. ‘ప్రజాస్వామ్యంలో ఇది పెద్ద పండుగ. నగర, పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు పూర్తిస్థాయిలో ఓటింగ్‌కు రావడం లేదు. అందరూ బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి. పట్టణాల్లో ఓటింగ్‌ శాతం తక్కువగా ఉండటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. విద్యావంతులంతా తమ బాధ్యతను నిర్వర్తించాలి. నా రాష్ట్రాన్ని ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్లే పార్టీకి ఓటు వేశాను’అని కేటీఆర్‌ చెప్పారు.

Recent

- Advertisment -spot_img