Homeహైదరాబాద్latest Newsఓటు.. ప్రజల జీవితాలను మార్చే సాధనం.. ఒక్క ఓటు బలం ఎంతో తెలుసా..?

ఓటు.. ప్రజల జీవితాలను మార్చే సాధనం.. ఒక్క ఓటు బలం ఎంతో తెలుసా..?

ఓటు అనేది ప్రజల జీవితాలని మెరుగుపరచడానికి ఉపయోగపడే అమూల్యమైన సాధనం. నేడు మారుతున్న జీవన పరిస్థితుల దృష్ట్యా ప్రజలు వివిధ రంగాలలో తలమునకలై ఉంటున్నారు. ఓటింగ్ రోజు తమ ఓటు హక్కు వినియోగించుకోకపోవడంతో ఓటింగ్ శాతం మెరుగైన స్థాయిలో నమోదు కావడం లేదు. ముఖ్యంగా పట్టణాలలో ఉన్నటువంటి ప్రజల్లో పోలింగ్ స్టేషన్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. దీనికి ముఖ్య కారణాలలో ఒకటి రాజకీయ నాయకులపై విరక్తి.

ఒక్క ఓటు బలం ఎంతో తెలుసా..?
ప్రతి ఓటు ప్రజల జీవితాలని మెరుగుపరచడానికి ఉపయోగపడే అమూల్యమైన సాధనం. అయితే తన ఒక్క ఓటు వేయకపోవడం వల్ల దేశ భవిష్యత్తుకు గాని, నాయకుడికి గాని ఎటువంటి నష్టం ఉండదని కొంతమంది ఓటర్లు భావిస్తున్నారు. కానీ, ఒకసారి గత ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ఒక్క ఓటుతో వివిధ పార్టీల అభ్యర్థులు ఎంపీ, ఎమ్మెల్యేగా ఓడిపోయిన సంఘటనలు ఉన్నాయి. అంతేకాకుండా అవిశ్వాస తీర్మాన సమయంలో ఒక్క ఎంపీ ఓటు తేడాతో ప్రభుత్వాలు కుప్పకూలిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి.

Recent

- Advertisment -spot_img