Homeహైదరాబాద్latest Newsడబుల్​ బెడ్రూం ఇండ్లు కావాలా? ప్రాసెస్ ఇదే​.. మేయర్​ కీలక ప్రకటన

డబుల్​ బెడ్రూం ఇండ్లు కావాలా? ప్రాసెస్ ఇదే​.. మేయర్​ కీలక ప్రకటన

ఇదేనిజం, హైదరాబాద్​: డబుల్​ బెడ్రూం ఇండ్లకు సంబంధించి నగర్ మేయర్​ విజయలక్ష్మి కీలక ప్రకటన చేశారు. సోమవారం హైదరాబాద్​ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మేయర్​ విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు డబుల్​ బెడ్రూం ఇండ్లకు సంబంధించి ఫిర్యాదులు చేశారు. ఎన్నికల కోడ్‌ కారణంగానే డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు మంజూరు చేయలేకపోయామని మేయర్​ చెప్పారు. ఇందుకు సంబంధిత అధికారులను కలిస్తే సమస్య పరిష్కారమవుతుందని సూచించారు. కొత్తగా ఇళ్ల మంజూరు కోసం జిల్లా కలెక్టర్లను సంప్రదించాలని కోరారు. ప్రజల నుంచి వచ్చిన ఇతర ఫిర్యాదులను వారంలోగా పరిష్కరించాలని అధికారులను మేయర్‌ ఆదేశించారు.

Recent

- Advertisment -spot_img