అనసూయ భరద్వాజ్ దాదాపు తొమ్మిదేళ్ల పాటు జబర్దస్త్ షోకు హోస్ట్ గా చేసి బాగా పాపులర్ అయింది. అయితే అనసూయ ప్రస్తుతం పూర్తిగా సినిమాలకే పరిమితమైంది. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో అనసూయ షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. తాను మళ్లీ తల్లి కావాలనుకుంటున్నట్లు అనసూయ తెలిపింది. ఆమెకు ఇప్పుడు నలభై ఏళ్లు. దానికి కారణం ఆడపిల్లకు జన్మనివ్వాలనుకుంటోంది అని తెలిపింది. అయితే తన భర్త ఆడపిల్లను కనేందుకు సహకరించడం లేదని చెప్పి ఆశ్చర్యపరిచింది. తన భర్త తనకు సపోర్ట్ చేయడం లేదని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.