పిల్లలు పుట్టిన నాటి నుంచి ఆరోగ్య బీమా సంరక్షణలో ఉంటే.. అత్యవసర వైద్య పరిస్థితుల్లో ఆందోళన చెందకుండా మెరుగైన చికిత్సను అందించవచ్చు. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకున్న వ్యక్తితో పాటు అతడి భార్య, పిల్లలను కూడా కవర్ చేస్తుంది. ఒకే ప్రీమియంతో కుటుంబం అంతటికీ రక్షణ లభిస్తుంది. కాబట్టి, తగినంత కవరేజీ ఉండేలా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు రిస్టోరేషన్ బెనిఫిట్తో కూడిన పాలసీలను తీసుకోవడం మంచిది. దీనివల్ల అధిక ప్రయోజనం ఉంటుంది.