Homeహైదరాబాద్latest NewsWar 2 : ''వార్ 2'' మూవీలో ఎన్టీఆర్ హీరోనా.. విలనా..?

War 2 : ”వార్ 2” మూవీలో ఎన్టీఆర్ హీరోనా.. విలనా..?

War 2 : టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), బాలీవుడ్‌ స్టార్ హీరో హృతిక్‌ రోషన్ (Hrithik Roshan) కలిసి ”వార్ 2” సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ పాత్ర పూర్తిగా విలన్ అని కూడా చెప్పలేము, ఎందుకంటే ఇది హృతిక్ రోషన్ పాత్రకు దీటుగా ఉండే కీలక పాత్రగా ఉండబోతుంది. ఈ సినిమా కథలో ఇద్దరు ప్రాణ స్నేహితులుగా మొదలై, చివరకు శత్రువులుగా మారే యాంగిల్‌లో ఎన్టీఆర్ పాత్ర రూపొందినట్లు తెలుస్తోంది. అందువల్ల, ఎన్టీఆర్ పాత్రను విలన్ కంటే బలమైన, నెగెటివ్ షేడ్స్ ఉన్న యాంటీ – హీరో లాంటిదిగా ఉండబోతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ మధ్య ఒక భారీ డాన్స్ సీక్వెన్స్ ఉండబోతుంది. ఈ డాన్స్ సీక్వెన్స్‌ను బోస్కో మార్టిస్ కొరియోగ్రఫీ చేశారు. అలాగే ఈ పాటలో 500 మందికి పైగా డాన్సర్లు పాల్గొన్నారు. ఈ పాట ఒక యాక్షన్ సన్నివేశంతో ముడిపడి ఉంటుందని, ఇది సినిమాకు ఒక హైలైట్‌గా ఉండబోతుంది. ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Recent

- Advertisment -spot_img