Homeహైదరాబాద్latest NewsTelangana Assembly: అసెంబ్లీలో మాటల యుద్ధం.. సీఎం రేవంత్ vs సబితా ఇంద్రారెడ్డి..!

Telangana Assembly: అసెంబ్లీలో మాటల యుద్ధం.. సీఎం రేవంత్ vs సబితా ఇంద్రారెడ్డి..!

కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి తనను ఆహ్వానించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌లో చేరితే తగిన గౌరవం లభిస్తుందని చెప్పారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఏ పార్టీ నుంచి వచ్చారని సబిత ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలని తానే స్వయంగా ఆహ్వానించానని చెప్పారు. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని అన్నారు. ఆడపిల్ల అని చూడకుండా తనను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారని సబిత అన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితను సొంత అక్కగా తాను భావించానని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్‌లో చేరినపుడు తనను సబితక్క ఆశీర్వదించిన విషయం నిజమేనన్నారు. తనను మల్కాజ్‌గిరి నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేయాలని సబితక్కే సలహా ఇచ్చారన్నారు. ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ తనను ప్రకటించాక, ఆమె బీఆర్ఎస్‌లో చేరడం తనకు ఆవేదన కలిగించిందని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img