Warangal:వరంగల్ జిల్లాలో నకిలీ విత్తనాల రాకెట్ గుట్టురట్టయ్యింది. నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న రెండు ముఠాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ విత్తనాలు అమ్ముతున్న 15 మందిని టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. వీరి నుంచి రూ.2కోట్ల విలువైన నకిలీ పత్తి విత్తనాలను సీజ్ చేశారు. 7 టన్నుల విడి విత్తనాలు, 9వేల 765 నకిలీ విత్తనాల ప్యాకేట్లు, డీసీఎం, కారు, రూ. 21 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. బ్రాండెడ్ కంపెనీ కవర్లలో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా నాలుగు రాష్ట్రాల్లో నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ, కార్ణటక, మహారాష్ట్ర, గుజరాత్ లో ఈ ముఠా దందా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.