Homeహైదరాబాద్latest NewsWarangal మేయర్ వ్యూహం అదేనా?

Warangal మేయర్ వ్యూహం అదేనా?

– పీఠాన్ని పదిలం చేసుకునేందుకు పావులు
– కారు దిగి ‘చేయి’పట్టుకునేందుకు రెడీ..
– త్వరలో హస్తం గూటికి..
– సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మేయర్ గుండు సుధారాణి..

ఇదే నిజం, వరంగల్ ప్రధాన ప్రతినిధి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. తాజా వరంగల్ మేయర్ గుండు సుధారాణి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం చర్చానీయాంశంగా మారింది. త్వరలో గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్ కార్పొరేషన్‌ (జీడబ్ల్యూఎంసీ) కుడా హస్తగతం కానున్నదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మేయర్ సీఎంను కలవడం ప్రత్యేకతను సంతరించుకున్నది. ఇప్పటికే ఏడుగురు కార్పొరేటర్లు బీఆర్‌ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రె స్ లో చేరారు. మంత్రి కొండా సురేఖ దంపతుల నేతృత్వంలో 15 మంది బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు సీఎం రేవంత్‌ సమక్షంలో కాంగ్రెస్ లో చేరేందుకు హైదరాబాద్‌లో మకాం వేశారు. అయితే, మేయర్ సుధారాణి హస్తం గూటికి వెళ్తారని ఎప్పటి నుంచో ప్రచారం జరగగా.. ఆమె ఆదివారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌ రెడ్డిని కలవడంతో ఆ ప్రచారానికి బలాన్ని చేకూర్చినట్లైయింది. కాగా, మేయర్ మాత్రం అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిసినట్లు చెబుతున్నా.. త్వరలో మేయర్‌తో పాటు మరో 20 మంది కార్పొరేటర్లు గులాబీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరుగుతున్నది.

గతంలోనే సీతక్కను కలిసిన మేయర్..
ములుగు ఎమ్మెల్యే, మంత్రి సీతక్క, వరంగల్ మేయర్ గుండు సుధారాణి గతంలో తెలుగుదేశంలో పార్టీలో కలిసి పనిచేశారు. ఆ సమయంలో సుధారాణి రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగారు. సీతక్క ములుగు నుంచి తెలుగుదేశం తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ ఎన్నికల సమయంలో ములుగు నియోజకవర్గ ఇన్ చార్జిగా గుండు సుధారాణి పనిచేశారు. వీరిద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. అక్కా చెల్లెల మాదిరిగా ఉంటారనే టాక్ ఉంది. అయితే, ఇప్పుడు వీరిద్దరి అంశం ఎందుకు తెరపైకి వచ్చిందంటే.. కొద్దిరోజుల క్రితం మేయర్ సుధారాణి హైదరాబాద్ లో మంత్రి సీతక్కను కలిశారు. జాగా ఆదివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం చర్చానీయాంశంగా మారింది. అయితే, మేయర్ మాత్రం అభి వద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరినట్లు చెబుతున్నా.. అంతర్గతంగా వేర్వేరు అంశాలు తెరపైకి వస్తున్నాయి.

మేయర్ కాంగ్రెస్ లో చేరితే..
గడిచిన కార్పొరేషన్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నది. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న గుండా సుధారాణికి మేయర్ గా అవకాశం కల్పించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో మేయర్ పై అంతప్తి తో ఉన్న కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం దిశగా అడుగులు వేస్తున్నారు. మరికొంత మందిని కాంగ్రెస్ వైపు తిప్పుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. త్వరలో అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధం చేసుకుంటున్న ఈ తరుణంలో మేయర్ సుధారాణి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. తానే కాంగ్రెస్ లో చేరితే అవిశ్వాస గండం నుంచి గట్టెక్కించ వచ్చని భావిస్తున్నట్లు సమాచారం.

Recent

- Advertisment -spot_img