Homeసినిమాహనుమాన్ చూసి నేర్చుకో.. ఓం రౌత్ కు ట్రోలర్స్ వార్నింగ్​

హనుమాన్ చూసి నేర్చుకో.. ఓం రౌత్ కు ట్రోలర్స్ వార్నింగ్​

హనుమాన్ మూవీకి పాజిటివ్​ రిపోర్టులు వచ్చాయి. గుంటూరు కారం మూవీకే అన్ని థియేటర్లు కేటాయించడంతో హనుమాన్‌కు అసలు స్క్రీన్లు దొరకలేదు. అయినప్పటికీ ఆ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. హనుమాన్ సినిమాకు పెట్టింది ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్లు. కానీ రాబట్టుకున్న అవుట్ పుట్ మాత్రం వంద కోట్లకు పైగా ఉంది. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టుగా.. హనుమాన్ హిట్టవ్వడం ఏంటో గానీ ఓం రౌత్‌ను మళ్లీ ట్రోల్స్ చేస్తున్నారు. ఆదిపురుష్‌ను ఎంత నాసిరకంగా తీశాడో మళ్లీ గుర్తు చేస్తున్నారు. ఇది టాలీవుడ్‌, బాలీవుడ్ మేకర్లు తెలుసుకోవాల్సిన విషయం అని.. ఇదొక గైడెన్స్‌లా నిలిచిపోతుందని, అంతా ప్రశాంత్ వర్మ వద్ద నేర్చుకోవాల్సిన విషయమని నెటిజన్లు అంటున్నారు. హనుమాన్ హిట్ అవ్వడం ఏంటో గానీ ఆదిపురుష్, ఓం రౌత్‌ను మాత్రం తెగ ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. సినిమా అంటే ఇలా తీయాల్రా అంటూ మండి పడుతున్నారు. ఇక ముందైనా తప్పులు చేయకుండా ఉంటాడు అని ఓం రౌత్ మీద ట్రోల్స్, మీమ్స్ వస్తున్నారు

Recent

- Advertisment -spot_img