Homeహైదరాబాద్latest Newsనాణ్యత లోపం వల్ల చెక్ డ్యాం నుంచి వాటర్ లీక్.. చర్యలు చేపట్టాలని కోరుతున్న రైతులు

నాణ్యత లోపం వల్ల చెక్ డ్యాం నుంచి వాటర్ లీక్.. చర్యలు చేపట్టాలని కోరుతున్న రైతులు

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలం పోతుగల్ గన్నె వారి పల్లె గ్రామాల మధ్య నక్క వాగుపై హై లెవెల్ బ్రిడ్జి అండ్ చెక్ డ్యాం నిర్మించారు. నిర్మాణంలో నాణ్యత లోపం వల్ల చెక్ డ్యాం నుండి వాటర్ లీక్ అవడంతో ఆ ప్రాంత రైతులు అవాక్కయ్యారు. భూగర్భ జలాలు పెంపొందడంకి ప్రభుత్వం చెక్ డ్యాంలు ఏర్పాటు చేస్తే సంబంధిత కాంట్రాక్టర్లు మాత్రం నాణ్యతతో కూడిన పనులు చేపట్టకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చెక్ డ్యామ్ నుంచి వాటర్ లీక్ కాకుండా చర్యలు చేపట్టాలని ఆ ప్రాంత రైతులు కోరుతున్నారు.

Recent

- Advertisment -spot_img