Homeహైదరాబాద్latest Newsఈ క్రిస్మస్ కి కూడా గట్టిగా కొడుతున్నాం : హీరో నాని

ఈ క్రిస్మస్ కి కూడా గట్టిగా కొడుతున్నాం : హీరో నాని

అల్లరి నరేష్ హీరోగా నటించిన సినిమా ‘బచ్చల మల్లి’. ఈ సినిమాకి సుబ్బు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ కి గెస్ట్ గా హీరో నాని వచ్చారు. ఈ ఈవెంట్ లో నాని మాట్లాడుతూ… అందరికి గుడ్ ఈవెనింగ్ ..ముఖ్యంగా మీడియా మిత్రలుకు.. నిన్న నుంచి బాగా బిజిగా ఉన్నటు ఉన్నారు.. మీ అందరిని కలుసుకోవడం ఆనందంగా ఉంది. ఈ సినిమా టీజర్ చూసి నేను నరేష్ కి ఫోన్ చేసి.. ఏదో చేయాలని ఉంది ఈ సినిమాకి ఏమి చేయను… ఈ సినిమా థియేటర్ ట్రైలర్ నేను రిలీజ్ చేయడం నేను చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాను. ఈ సినిమా ఆల్రెడీ హిట్ అయిపోయింది. చాలా రోజుల తర్వాత నరేష్ హిట్ కొడుతున్నాడు,ప్రేక్షకులు కూడా అదే ఫీల్ అవుతున్నారు. ఈ సినిమా డైరెక్టర్ సుబ్బు నాకు చాలా ఇష్టం.. నేను చేసిన ‘మజ్ను’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు. నరేష్ సినిమాతో డైరెక్టర్ గా మరి మంచి బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు. ‘పుష్ప 2’ డిసెంబర్ లో ఫుల్ మీల్స్ పెట్టేసింది.. ఇదే డిసెంబర్‌ని ‘బచ్చల మల్లి’ డెసర్ట్‌తో ఎండ్ చేస్తుంది అని నాని అన్నారు.

Recent

- Advertisment -spot_img