– కొన్ని రాష్ట్రాల్లో సెక్రటేరియేట్ల కంటే మన కలెక్టరేట్లు బాగున్నాయి
– ఐటీ మంత్రి కేటీఆర్
– భూపాలపల్లిలో కలెక్టరేట్ ను ప్రారంభించిన మంత్రి
ఇదేనిజం, భూపాలపల్లి: కొన్ని రాష్ట్రాల్లో సెక్రటేరియట్ల కంటే మన రాష్ట్రంలో కలెక్టరేట్లు బాగున్నాయని ఐటీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కేటీఆర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యాక్రమంలో ఎమ్మె్ల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. తర్వాత డబుల్ బెడ్రూం ఇండ్లతోపాటు గృహలక్ష్మి, దళితబంధు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తారు. సుభాష్‌కాలనీ పక్కనే గల మినీ స్టేడియంలో భారీ బహిరంగసభలో పాల్గొంటారు. పరకాలలో మున్సిపాలిటీ, తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయ భవనాలను ప్రారంభిస్తారు.
వేరే రాష్ట్రాలలో సెక్రేరియట్‌లు.. కనీసం మన జిల్లా కలెక్టర్ కార్యాలయాల మాదిరి కూడా లేవని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. దేశంలో భౌగోళికంగా 11 పెద్ద రాష్ట్రం, జనాభా పరంగా 12వ రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. దేశానికి ఆర్థిక చేయూతను అందించడంలో తెలంగాణ 4వ రాష్ట్రమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 10 వ స్థానంలో కూడా లేదని కేటీఆర్ అన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్‌గా నిలవడం గర్వకారణమన్నారు.