తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై రైతులు తిరగబడుతున్నారు అని పాడి కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రైతులు తిరగబడి కలెక్టర్‌ను ఉరికించారు అని వాపోయారు. రేపు రేవంత్ రెడ్డిపై రైతులు తిరగబడ్డ ఏ పోలీసు కాపాడలేడు అని కౌశిక్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి మీద సమాజం తూ తూ అని ఉస్తుంది అని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. నీకు కేసీఆర్, కేటీఆర్ హరీష్ రావు అవసరం లేదు.. నీకు మేమే ఎక్కువ అంటూ పాడి కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ పై మండిపడ్డారు.