ఇదేనిజం,కంగ్టి : రెండు రోజుల క్రితం బిఆర్ఎస్ నాయకులు విసిరిన సవాల్ ను స్వీకరిస్తూ మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు కంగ్టి మండల కేంద్రంలో పత్రికసమావేశం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ నాయకులు మనోజ్ పాటిల్,కాలే రాజు, గణపతి,మాట్లాడుతూ.. కంగ్టి మండల కేంద్రంలోని 34 గ్రామంలో ఏ గ్రామామైన ఎంచుకోండి చర్చలకు మేము సిద్ధగా ఉన్నామని అన్నారు. బిఆర్ఎస్ నాయకులు 10 సంవత్సరలో చేసిన అభివృద్ధిని చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు. సుభాష్ చంద్రబోస్ చౌరస్తా నుండి పిట్లం వెళ్లి రోడ్డు 7 సంవత్సరలు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు బిఆర్ఎస్ నాయకులకు ఆ రోడ్డు ఎందుకు? గుర్తురాలేదని ఇపుడు ఏ ముఖం పెట్టుకొని రోడ్డు గురించి మాట్లాడుతున్నారని అన్నారు . బిఆర్ఎస్ నాయకులకు అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎంత మంది పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇచ్చారో శ్వేత పత్ర విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఏమాయే?దళిత సీఎం ఏమాయె ఇవేవీ అప్పుడు గుర్తుకు రాలేవా అని అన్నారు.
కంగ్టి మండల పరిధిలోని 34 గ్రామంలో ఎంత మంది దళితులకు మూడు ఎకరాల భూమిని ఇచ్చారు. బిఆర్ఎస్ నాయకలు చెప్పాలి అన్నారు దళిత బంధు ఎంత మందికి ఇచ్చారు చెప్పాలని అన్నారు. 34 గ్రామాల్లో ఏ గ్రామంలో పేద ప్రజలకు డబ్బులు బెడ్ రూమ్ ఎన్ని ఇచ్చారో చెప్పాలని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళితులకు తీరని అన్యాయం జరిగిందని అన్నారు. పది సంవత్సరాల్లో అధికారంలో ఉండి తెలంగాణను అప్పుల పాలు చేసిన ఘనత బిఆర్ఎస్ దే అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు నారాయణాఖే నుండి కర్ణాటక బార్డర్ వరకు వేసిన డబుల్ రోడ్డు మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి హయాంలో రోడ్డు శాంక్షన్ ఆయన రోడ్డులు మాజీ మంత్రి హరీష్ రావు నేను చేశాని చేపి ప్రజలను మోసం చేశారని అన్నారు . సిద్దిపేట ఒక్క కన్ను నారాయణఖేడ్ ఒక్క కన్ను అని చేపి నారాయణఖేడ్ నియోజకవర్గని మోసం చేసిన ఘనత బిఆర్ఎస్ పార్టీ నాయకులదే బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్ట్ ద్వారా తాగు నీరు సాగు నీరు అందించి కంగ్టి మండల ప్రజల నీళ్ల ద్వారా పాదాలు కడుగుతానాని చేపి మోసం చేశారుని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మదన్,వైజనాథ్, మాణిక్ పాటిల్, సంతోష్ పాటిల్, విశ్వనాథ్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.