– చంద్రబాబు హయాంలో కాంగ్రెస్ ఓడిపోతే.. కేసీఆరే జీవం పోశారు
– మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిందే తామేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. 2004లో టీఆర్ఎస్ పార్టీ వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో కాంగ్రెస్ ఓడిపోయి ప్రతిపక్ష హోదా దక్కకుండా దిగజారిపోయిందని, అప్పుడు కాంగ్రెస్ పార్టీకి జీవం పోసిందే కేసీఆరే అని పేర్కొన్నారు. కాంగ్రెస్ గెలిస్తే పదవులు ఇవ్వలేదని, తాము పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీకి భిక్ష పెట్టామన్నారు. రేవంత్ ఏబీవీపీతో మొదలు పెట్టి టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ ఇలా పార్టీలు మారారని, రేవంత్ రేపు ఏ పార్టీలో ఉంటారో తెలిదన్నారు. పార్టీలు మారని చరిత్ర తమదేనన్నారు.